వేరుశనగ, బలమైన ఆహారం. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.
వేరుశెనగ జన్మస్దలం దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ ‘లెగుమినస్’ జాతికి చెందిన మొక్క. శాస్త్రీయ నామం “అరాచిస్ హైపోగేయా లెగ్యూమ్”. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్దితులను తట్టుకోగలదు. వేరుశనగ పుష్పాలు బయట ఫలధీకరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారతాయి.