మినుములు (ఆంగ్లం Black gram) నవధాన్యాలలో ఒకటి. ఇవి భారతీయుల ఆహారంలో ముఖ్యమైనది.
గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి ఉద్దులు అనే పేరు కూడా ఉంది. కందులతో పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పుధాన్యాలలో కన్నా ఈమినుములు అత్యంత భలవర్థకము. మినుములను యదాతదంగాను వాడుతారు. లేదా పొట్టుతీసి పప్పును ఉపయోగిస్తారు. మినుములను పొట్టుతీసి మినప గుళ్ళుగాను వినియోగిస్తారు.