Dry Raosted Chana Dal and putnaluకొవ్వు రహిత ఆహారాలకు దూరంగా ఉండటం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే పుట్నాలను రోజు వారీ ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, దీర్ఘాయువు మెరుగుపడుతుంది. పుట్నాలలో సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, ఫైబర్ ద్వారా మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
అలాగే శరీరంలోని వ్యర్థాలను తొలగించి, అంతర్గత అవయవాలను శుభ్రపరచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్నాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఇది మంచి ఆరోగ్యానికి అవసరం. కణాలు, కణజాలాలు, ఎముకలు, కండరాల నిర్మాణానికి ప్రోటీన్ అవసరం. ఈ పుట్నాలను తీసుకుంటే చర్మం నుండి దద్దుర్లు, గజ్జి, తామరలను త్వరగా తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మంపై ముడతలను తొలగిస్తుంది.