గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహారం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు.