Sale!

ANJIR (అంజూరం) 500g grade 1

Original price was: ₹800.00.Current price is: ₹600.00.

Check Availability:

ఆరోగ్యానికి అంజీర ఫలం
కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కడుపులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడుపులో మంట, అజీర్తి సమస్యతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. రక్తస్రవరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ పుష్టికి ఉపకరిస్తుంది. అతి ఆకలితో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణము ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు.

నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. సూపర్‌ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అంజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడుపులో మంట గలవారు పుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయపడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.

అత్తి చెట్టు, పండు
రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే ‘పెక్టిన్‌’ అనే పదార్థము కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఒంటిమీద గడ్డలు, కురుపులకు ఈ పండు గుజ్జును పూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. అన్ని మేడిపండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర తరహా మాత్రం కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోవాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనిపిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.

వంద గ్రాముల పండ్లలో పోషకాలు
పిండి వదార్థం – 19 గ్రా,
వీచు వదార్థాలు – 3 గ్రాములు,
చక్కెర – 16 గ్రాములు,
కొవ్వు – 0.3 గ్రాములు,
ప్రొటీన్లు – 0.8 గ్రా,
విటమిన్‌ ‘బి6’ – 110 గ్రా,
శక్తి – 70 కిలో.కె.