పసుపు (లాటిన్ Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన సాంగ్లి పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. పసుపును కనీసము 3000 సంవత్సరాలనుంది భారతీయులు వాడుతున్నారు . చిన్నచిన్న గాయాలనుండి క్యాన్సర్ వ్యాధులవరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది . మనదేశములో ఆహారములో రంగు, వాసనలతో పాటు ఔషధగుణాల పేరున పసుపును వాడుతున్నారు . పసుపు క్రిమిసంహారిని … క్రిములను నసింపజేస్తుంది . శరీరము పై ఏర్పడిన గాయాలకు, పుల్లకు పసుపు పూస్తే సూక్ష్మక్రిములు దరిచేరవు … సెప్టిక్ అవదు, త్వరగా మానుతుంది . ఇది ప్రకృతి ప్రసాధించిన మహా దినుసు . దీనిలోని ” కర్కుమిన్ ” వాపులను తగ్గిస్తుంది యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది . దీని శాస్త్రీయ నామము ” Curcuma longa . పసుపు (లాటిన్ – Curcuma longa), అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు